SAKSHITHA NEWS

బీసీ కులసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాటం నరసింహ యాదవ్ నివాసం ఖైరతాబాద్ లో ప్రెస్ మీట్ జరిగింది.

బీసీల సామజిక మరియు రాజకీయ చైతన్యం తద్వారా రాజ్యాధికారం సాధించడానికి బీసీలంతా ఒకటి కావాలని, రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీల జనాభాకు అనుగుణంగా టిక్కెట్లు కేటాయించాలనే అంశంతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ మాట్లాడుతూ

స్వాతంత్ర పోరాటం మొదలుకొని తెలంగాణ ఉద్యమం వరకు కీలక పాత్ర పోషించి ప్రాణాలు సైతం అర్పించిన బీసీలను నేటికీ అగ్రవర్ణాల ఆధిపత్యంతో సామాజికంగా ఎదగనీయకుండా చేస్తున్నారు.
52 శాతం జనాభాకు దగట్టుగా రాజ్యాంగపరమైన రిజర్వేషన్స్ కల్పించకపోగా 27% కూడా వర్తింపజేసే పరిస్థితులు లేకపోవడం శోచనీయం.
ఏ వర్గాలకు లేని క్రీమిలేయర్ ను బీసీ వర్గానికి ఆపాదించడం బీసీల న్యాయపరమైన వాటాకు గండికొట్టడమే.
రాజకీయ క్షేత్రంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు తమ సంస్థాగత కార్యవర్గాలలో గాని, రాజ్యాంగబద్ధమైన పదవులలో గాని, ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు గాని జనాభా ప్రకారం కేటాయించక పోవడం పరిశీలించవలిన విషయం.
బీసీలలో చట్టసభల్లోకి అడుగుపెట్టని చిన్న కులాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం సామజిక స్ఫూర్తికి తీరని విఘాతం.
బీసీ ఉప ప్రణాళిక, ప్రత్యేక బీసీ బడ్జెట్, బీసీ గణన పై ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.
బీసీలకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పర్చి శిక్షణనిచ్చి ఏ షరతులులేని సబ్సిడీ రుణాలను అందించి వారి ఆర్థికాభివృద్ధికి సహకారం అందించాలి.
కాకా కాలేల్కర్, బీపీ మండల్ కమిషన్ సిఫార్సు చేసిన అంశాలను పునఃసమీక్షించి వాటిపై ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకోవాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరాజ్ సామజిక వర్గ బీసీ బిడ్డల మనోభావాలు దెబ్బతీసే విదంగా కుంచిత స్వభావం ప్రవర్తించిన పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని కండిస్తూ, తీవ్రంగా హెచ్చరిస్తున్నాము – అన్నారు

కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు చిగుమళ్ల బాల ప్రకాష్, పి.యెన్. చారీ, కాటం శ్రీకాంత్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుండ్ల ఆంజనేయులు గౌడ్, సిలివేరు శంకర్ ప్రజాపతి, రాష్ట్ర కోశాధికారి శెట్టి ప్రదీప్ యాదవ్, సభ్యులు టి.శ్రీరాములు, మామిడాల కవిత, టీ. ఆదినారాయణ యాదవ్, సుధాకర్ చారీ, దొడ్డి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS