Under the leadership of Mala Mahanadu Ambedkar’s death anniversary celebrations
మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి వేడుకలు
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సభను ఖమ్మం జిల్లా మాల మహానాడు కార్యదర్శ ఎర్ర గంగాధర్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతేటి వీరభద్రం పాల్గొని అంబేద్కర్ విశిష్టతను మేధాశక్తి గురించి గొప్ప ధీరుడు ప్రపంచ మేధావి ఈ దేశానికి దశా దిశను అందించిన మహోన్నత వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు దిక్సూచి అయిన అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పల్లా రాజశేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో ఎక్కువగా చేర్పించి విద్యా విధానంలో ముందుకు తీసుకురావాలని అంతటి గొప్ప వ్యక్తిని కొంతమందికి పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆయన చరిత్రను తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రాష్ట్ర నాయకులు ముత్తమాల ప్రసాద్ అంబేద్కర్ జీవితం గురించి విధి విధానాల గురించి ప్రసంగించారు అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు లింగాల రవికుమార్ పాల్గొని అంబేద్కర్ గొప్పతనం గురించి ఆయన చిన్ననాటి చరిత్రను
విద్యా విధానంను జీవిత చరిత్రను వివరించారు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కొట్టే సుధాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలో ఎన్నో ఆటుపోటును ఎదుర్కొని విద్యను అభ్యసించి అణగారిన జీవితాలకు వెలుగు రేఖలు నింపిన తన జీవితం మనకు దిక్సూచి లాంటిదని అంబేద్కర్ను కొందరి వాడిగా కాకుండా అందరివానిగ ఆదరించాలని కోరారు స్టేట్ జర్నలిస్టు సంఘం నాయకులు మూటపోతుల బాబురావు అంబేద్కర్ ఆశయ
సాధన కోసం అందరూ కృషి చేయాలని ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ను గొప్ప వ్యక్తిగా చూడాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో రెంటాల ప్రసాద్ దామల సత్యం తొగర భాస్కర్ సతీష్ పిల్లి సురేందర్ నామ యేసు రత్నం రెంటాల శ్రీరామ్ పంబ రవి దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.