Two state level Kabaddi competitions should be successful
రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి
నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు దూసరి నేతాజీ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలో నేరడ గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19, 20 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షులు దూసరి నేతాజీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో 41 ఏండ్లుగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా 18వ తేదీ శనివారం మధ్యాహ్నాం 12 గంటల నుండి 20వ తేదీ వరకూ కబడ్డీ పోటీలు జరగనున్నట్టు తెలిపారు. అంతే కాకుండా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 40వేల రూపాయలు రెండవ బహుమతి 30వేల రూపాయలు, మూడవ బహుమతి 25వేల రూపాయలు, నాల్గవ బహుమతి 20వేల రూపాయలు, ఐదవ బహుమతి 15వేల రూపాయలు, ఆరవ బహుమతి 10వేల రూపా యలు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ క్రీడలకు ముఖ్య అతిథులుగా మధిర శాసనసభ సభ్యులు మల్లుభట్టి విక్రమార్క పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 7093900119, 9618581507, 9848395035 నంబర్లను సం ప్రదించాలని కోరారు.