SAKSHITHA NEWS

తుంగభద్ర డ్యాం గేట్ల మార్పునకు గ్రీన్సిగ్నల్

తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలన్న తుంగభద్ర బోర్డు ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అధికారులు అంగీకరించారు. కానీ, గేట్ల ఎత్తు పెంచడం వల్ల డ్యాం నిల్వ సామర్థ్యం పెరగ కుండా చూడాలని తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదన కు బోర్డు అంగీకరించింది. కొత్తగేట్లు అమర్చాలని నిపుణుల కమిటీ నివేదికను బోర్డు సమావేశంలో సభ్య కార్యదర్శి ఓఆర్కే రెడ్డి ప్రవేశ పెట్టారు. దీనిని మూడు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు.దశల వారీగా గేట్లను మార్చాలని అధికారులు నిర్ణయించారు.


SAKSHITHA NEWS