SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

విఓ ఏ ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రం 5వ రోజు విఓ ఏ సమ్మెకు మద్దతుగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మద్దతు తెలుపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వి ఓఏ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది.

ప్రభుత్వం వెంటనే యూనియన్ తో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి డిమాండ్లపై చర్చించి పరిష్కారం చేయాలని అన్నారు .లేని పక్షంలో రోజువారి నిరసన కార్యక్రమాలు ఈనెల 21 చెవిలో పువ్వులు పెట్టి నిరసన తెలుపటం 24 ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలపటం. 26న రోడ్లు ఊడ్చి నిరసన తెలపడం. 27 మోకాళ్లపై కూర్చొని నిరసన తెలపడం. 28 బిక్షాటన కార్యక్రమం. 29 ఆకులు తింటూ నిరసన తెలపడం. మే 1న సమ్మె శిబిరం వద్ద మేడే కార్యక్రమం నిర్వహించడం. మే 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు వంటావార్పు కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్, సిఐటియు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, సంఘం నాయకులు ఏదుల్లా లక్ష్మి, గుడిసె పద్మ, మహంకాళి వనజ కుమారి, గుడిసె సువర్ణ, పాకాల సత్యనారాయణ, దేశపాక సత్తమ్మ, వడ్డగానీ విజయ తో పాటు కార్మికులందరూ పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 21 at 3.34.10 PM

SAKSHITHA NEWS