సాక్షితతిరుపతి నగరం : ఒంగోలు సిద్దంకు తిరుపతి నుండి 15వేల మంది వెలదాం: ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్*
టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అధ్యక్షతన, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పర్యవేక్షణలో సాయంత్రం తిరుపతిలోని ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 10వ తేది ఒంగొల్లో జరగబోవు సిద్ధం సభను విజయవంతం చేయాలనే సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధం పోస్టర్లను ఆవిష్కరించి, పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసిన భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, తిరుపతి నగర వైసిపి అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, కార్పొరేటర్లు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ భీమిలి, పశ్చిమ గోదావరి, అనంతపురం ప్రాంతాల్లో మూడు సిద్ధం సభలు బ్రహ్మాడంగా జరిగాయని, ప్రత్యేకించి రాప్తాడు సభ దేశంలోనే అతి పెద్ద బహిరంగ సభగా చరిత్ర కెక్కిందని, ఒంగోలులో జరగనున్న సిద్ధం సభను 14 నుంచి 15 లక్షల మందితో నిర్వహించే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.మొదట జరిగిన సిద్ధం సభకే తెలుగుదేశం వాళ్ల గుండెలు అదిరిపోయయన్నారు. జగనన్న మినహా ప్రపంచంలోనే మరే నాయకులు కూడా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు నేరుగా పంచిన నాయకులు లేరని, అందువల్లే మన పార్టీకి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఈ రోజు ఎన్నికలు జరిగినా మనకు 142 నుంచి 144 స్థానాలు వస్తాయని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయని, వంద శాతం మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేసారు.
తిరుపతి అభివృద్ధి గురించే ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోందన్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులు సంతోషంతో మునిగి తేలేలా పాలక మండలిలో నిర్ణయాలు తీసుకున్నామని, విశ్రాంత ఉద్యోగులతో సహా 7,500 మందికి సొంతింటి కల నేరవేర్చామని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సహా 21వేల మందికి కనీసం 5 వేల రూపాయలకు తగ్గకుండా జీతాలు పెంచామని గుర్తు చేసారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్ధి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా వుండాలని, ఒంగోల్ సిద్ధం సభకు తిరుపతి నుంచి 15 వేల మందికి తగ్గకుండా వెళ్దామన్నారు. సుమారు 250 నుంచి 260 బస్సులు తిరుపతి నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు. ఇక అభివృద్ధిలో తిరుపతి రూపురేఖలు మార్చేశామని, ఇప్పటికే నేను సుమారు 270 సంఘాలను కలిశానని, జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందని, మంచి మెజారిటీతో మనం గెలుస్తామని, ఎలాంటి పొరబాట్లు చేయకుండా, చివరి దాకా చిత్తశుద్ధితో పని చేయడమే మన పని అని భూమన అభినయ్ రెడ్డి అన్నారు