సాక్షిత తిరుపతి నగరం:
మహిళలు అన్ని రంగాల్లో అధ్బుతంగా రాణిస్తు దేశం అభివృద్ది వైపుకు తీసుకెల్లడంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి శ్రీపధ్మావతి మహిళా యూనివర్సిటీ, ఉప్పరపల్లెకు వెల్లె రహదారి కార్నర్లో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రంగాల్లో రాణిస్తున్న ఎనిమిది మహిళా విగ్రహాలని, ప్రీ లెప్ట్ ను టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, శ్రీపధ్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ భారతి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పించడం ద్వారా అన్ని రంగాల్లో ముందుంటారని, మన రాష్టంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అనేక పథకాల ద్వారా మహిళలకు అన్ని విధాల అండగా నిలిచారని భూమన తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 8 మహిళామణుల విగ్రహాలని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. 80 లక్షల వ్యయంతో మహిళా విగ్రహాలను, ప్రీ లెప్ట్ పనులను చేపట్టడం జరిగిందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి షాలువలు తెప్పించి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, వీసి భారతి, రిజిస్ట్రార్ రజని, వైసిపి నాయకురాలు గీతా యాదవ్ కు షాలువలు కప్పి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ మహేష్, నాయకులు డిష్ చంధ్ర, తిమ్మారెడ్డి, మబ్బు నాధముని రెడ్డి, పడమటి కుమార్, మాకం చంద్ర, రెడ్డిరాణి, అమరనాధ్ రెడ్డి, అమోస్ బాబు తదితరులు పాల్గొన్నారు.