తిరుమల
తిరుమల ఆలయం ఎదుట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేది వరకు స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, అక్టోబర్ 14 నుంచి 22వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.
సెప్టెంబరు 18వ తేదిన శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమలకి విచ్చేసి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయడం జరిగిందన్నారు. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తామని, భక్తులకు వసతులు, భద్రతపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు మాడా వీధులలో కావల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు