కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ…
గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ఉప్పేరు గ్రామంలో రజక సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు… ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ భారతదేశానికి పర పీడన పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్ర్య పోరు సాగుతున్న రోజులు ఓవైపు… నిజం నవాబు పాలనలో బాధలు భరించలేక నిజాం రజాకార్లను తుదముట్టించేందుకు మహోజ్వల వీర తెలంగాణ విప్లవ సాయిధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డ ముందుండి నడిపించారు… ఐలమ్మ అడుగుజాడల్లో నడచి యువత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సరితమ్మ సూచించారు..అనంతరం గ్రామంలో ఎర్పాటు చేసి వినాయకుని దర్శించుకుని, వాల్మీకి మహర్షి విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, మోతీలాల్,ఆనంద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,బాలు,రజక సంఘం నాయకులు పెద్ద కొటన్న,టైలర్ ఆంజనేయులు, బ్యారం నరిసింహులు, చిన్న కొటన్న,గోపాల్, మశన్న,రంజీత్ గౌడ్, సతీష్, అశోక్, శ్రీను మహిళలు యువత తదితరులు ఉన్నారు…