SAKSHITHA NEWS

హైపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు వనపర్తి డయాలసిస్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన…… సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు జయరాములు

*సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సెంటర్ లో చికిత్స నిర్వహించడం జరుగుతుందని కానీ కొంతమంది హైపర్టైటిస్ బి వ్యాధిగ్రస్తులకు ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం లేదని చికిత్స కోసం వారు హైదరాబాదు లేక మహబూబ్నగర్ డయాలసిస్ సెంటర్లకు వెళ్లి చికిత్స పొందుతున్నారని వారి ఆరోగ్య రిత్య దూర ప్రాంతాల ప్రయాణం కష్టంగా మారుతుందని ప్రతి రెండు రోజులకోసారి ప్రయాణ సమయంలో వారి వెంట కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాల్సి వస్తుందని దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున వారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ స్పందించి వారికి కూడా వనపర్తి డయాలసిస్ సెంటర్లోనే చికిత్స నిర్వహించాలని సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జానంపేట రాములు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు విజ్ఞప్తిచేసినట్లు ఆయన తెలిపారు


SAKSHITHA NEWS