SAKSHITHA NEWS

గచ్చిబౌలి ట్రాఫిక్ PS, సైబరాబాద్ పరిధిలో గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రహదారి వైపు ఫ్లైఓవర్ పని కోసం ట్రాఫిక్ మళ్లింపు. GHMC శిల్పా లేఅవుట్ ఫేజ్-II ఫ్లై ఓవర్ పనిని  గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రోడ్డు వరకు (90) రోజుల పాటు అంటే 13.05.2023 నుండి 10.08.2023 వరకు పని చేస్తారు .  నేపథ్యంలో కింది మార్గాల్లో వాహనాలను దారి మళ్లించడం జరుగుతుంది . ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సూచించడమైనది. ఈ సంధర్బంగా మీడియా వారిని వివిధ మార్గాలలో మళ్లించబడిన ట్రాఫిక్ పైన అవగాహహన కోసం మీడియా వారిని అలాగే GHMC అదికారులను బస్సులో తీసుకొని వెళ్ళి, ట్రాఫిక్ కోసం ఏర్పాటు చేయబడిన ప్రతి మార్గాన్ని అలాగే diversion ను సందర్శించడం జరిగినది.

పై పనిని సులభతరం చేయడానికి క్రింది ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక చేయబడింది:-

1.ORR నుండి హఫీజ్పేట వైపు వచ్చే ట్రాఫిక్ ను గచ్చిబౌలి జంక్షన్ ద్వారా మళ్లించి  శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ -AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ ఫ్లైఓవర్– హాఫీజ్పేట్ వెళ్లేవిధంగా ఏర్పాటు చేశారు.

2.లింగంపల్లి నుండి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ ను గచ్చిబౌలి ట్రాఫిక్ PS – DLF రోడ్ – రాడిసన్ హోటల్ – కొత్తగూడ మీదుగా కొండాపూర్ వద్ద మళ్లించబడినధి.

3.విప్రో జంక్షన్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ IIIT జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది – ఎడమ మలుపు – గచ్చిబౌలి స్టేడియం వద్ద U టర్న్ – DLF రోడ్ – రాడిసన్ హోటల్ – కొత్తగూడ Alwyn X రోడ్డు వైపు వెళ్ళాలి.

4.టోలిచౌకి నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ – మైండ్స్పేస్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. – సైబర్ టవర్స్ జంక్షన్. – హైటెక్స్ సిగ్నల్ వైపు ఎడమవైపు – కొత్తగూడ జంక్షన్ ద్వారా వెళ్ళాలి.

5.టెలికాం నగర్ నుండి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి వద్ద ఫ్లై ఓవర్ కింద యుటర్న్ వద్ద మళ్లించబడుతుంది. – బస్ స్టాప్ పక్కన శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ – AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళాలి.

6.ఆల్విన్ X రోడ్  నుండి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ కొత్తగూడ జంక్షన్‌ వద్ద మళ్లించబడుతుందిహైటెక్స్ రోడ్డు వైపు – సైబర్ టవర్ – మైండ్స్పేస్ జంక్షన్శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ – గచ్చిబౌలి / ORR ద్వారా వెళ్ళాలి.

7.ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుండి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. – మసీదుబండ – హెచ్సియు డిపో – లింగంపల్లి ద్వారా వెళ్ళాలి.

8. కూకటపల్లి నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళ వలసిన వారు సైబర్ టోవేర్స్ మీదుగా -యికేయ అండర్ పాస్ -బయో  డైవర్సిటీ రైట్ టర్న్ గచ్చిబౌలి మీదుగా వెళ్ళాలి అలాగే రివర్స్ ట్రాఫిక్ అదే మార్గంలో వెళ్ళాలి.

9. Thub రోడ్లను ఉపయోగించుకునే విధంగా కేబల్ బ్రిడ్జ్ -కోహినూర్ హోటల్ -తంగేడు Restaurent -ఖజాగుడా వైపుకు, అలాగే రివర్స్ ట్రాఫిక్ అదే మార్గంలో వెళ్ళాలి.

10. IKEA రోటరీ వద్ద మూడు U Turns లను C గెట్ వద్ద, NCC ముందు అలాగే IKEA స్టోర్ వద్ద  ఇవ్వడం జరిగింధీ రోటరీ చిన్నది కావటం వలన ట్రాఫిక్ లాక్ కాకుండా ఏర్పాటు చేయటం జరిగినది.

11. Hitex  వద్ద U టర్న్ ఏర్పాటు చేసి Tech MahindraLemon Tree Hotel మీదుగా ట్రాఫిక్ రెండు వైపులా మూవ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరిగినది.

            ఈ సంధర్భంగా పాత్రికేయులను, GHMC మరియు అధికారులను బస్ ద్వారా పైన చెప్పనా  రూట్ లలో తిప్పి అవగాహన కల్గించడం జరిగినది. ఈ ఆవగాహన ద్వారా మీడియా మిత్రులంధరు ప్రజలకు, ఈ రూట్ లలో తిరిగే IT ఎంప్లాయూస్ కు తగిన అవగాహన కల్పించమని కోరడం అయినది.

ఈ సంధర్భంగా మరొక్కసారి మీడియా వారు, ఇతర  అపోహాలకు తావు ఇవ్వరాదు  అని విజ్ఞప్తి చేయడం అయినది.

చివరగా ప్రజలు తమ పనులు సజావుగా సాగేందుకు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ మరియు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని మనవి .


SAKSHITHA NEWS