తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కొండ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో క్రియశిల పాత్ర వహించిన వ్యక్తుల్లో కొండ బాలకృష్ణ ముఖ్యుడని,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన విభాగంలో తమ వంతు అనేక సహాయ కార్యక్రమాలు బాలకృష్ణ చేశారని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం అన్నారు.
ఆయన దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చ పేట గ్రామంలో ఉన్న కొండ బాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి రూ 4వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది, అంతేకాకుండా తెలంగాణ పద్మశాలి సంఘం బాలకృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తామని బూర మల్లేశం అన్నారు,కొండ బాలకృష్ణ లేని లోటు బీ ఆర్ ఎస్ పార్టీకి, తెలంగాణ పద్మశాలి సమాజానికి తీరని లోటని బూర మల్లేశం అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల తిరుపతి, జిల్లా కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు, ఈ సీ సబ్యులు బడుగు రాజు,అస రవి,పద్మశాలి కులస్థులు తదితరులు పాల్గొన్నారు.