కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరిన TPCC రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్&డోర్నకల్ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్ గారు
నియంతృత్వ పాలనను తరిమికొట్టాలంటే ఐకమత్యంగా పోరాడాలని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు….
ఈ సందర్భంగా నెహ్రూ నాయక్ గారు మాట్లాడుతూ మన నీళ్ళు, నిధులు, మన నియామకాలు అంటూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో సకల జనులు కలిసి చేసిన పోరాటంలో తెలంగాణ తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కూబిలోకీ నెట్టి, అప్పుల రాష్ట్రాన్ని చేశారని, మన తలాపున ఉన్న నీటిని, ఇసుకను దొంగతనంగా తరలించారు తప్ప మనకు ఎలాంటి నిధులు, నియామకాలు, నీళ్ళు ఇవ్వలేదని అన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకుని కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి చెందింది కానీ, ప్రజలు మాత్రం నష్టపోయారని అన్నారు.
అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేసి, కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలను అమలుపరుస్తం అని అన్నారు. మహిళలకు ప్రధాన పీట వేస్తూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అర్హులైన ప్రతి ఒకరికి ఇందిరమ్మ ఇండ్ల కొరకు 5 లక్షల సాయం మరియు ఇండ్ల స్థలం లేని వారికి 250 చదరపు గజాల ఉచిత స్థలం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం, విద్యార్థుల ఉన్నత చదువులకు 5 లక్షల వరకు ఉచితం, గృహ జ్యోతి ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు ఇస్తాం అని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తాం అని అన్నారు. ఎస్.ఎస్టీ లకు బ్యాంకుతో సంబంధం లేకుండా 12 లక్షల రూపాయల ఫుల్ సబ్సిడీ ఇస్తాం అని, అలాగే ఎస్.ఎస్టీ లకు 6 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మిస్తాం అని అన్నారు. ఇవి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లోపే అమలవుతాయని, కర్ణాటక రాష్ట్రంలో అమలవుతుంది అని, రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలవుతుంది అని అన్నారు. అందుకే ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్దితో పని చేసి, కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని సూచించారు.