SAKSHITHA NEWS

టొయోటాను ఆదరించాలి.
పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవం
ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం
టొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ వద్ద మోడీ టొయోటా గ్రామీణ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన వాహనాలు రెండు రోజులు పాటు ప్రదర్శనలో ఉంటాయన్నారు. టయోటా వారు అందిస్తున్న కార్లులో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అందరికి అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రెండు రోజుల ఆఫర్లను పొంది వాహనాలను కొనుక్కోవాలన్నారు. మోడీ టయోటా జిఎం ఎన్.మురళీకృష్ణ మాట్లాడుతూ వాహనంపై సుమారుగా రెండు లక్షల రూపాయలు తగ్గింపు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రవి, శివ, భాష, సర్పంచ్ గుండ భాస్కర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS