శంకర్పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాఘ పూర్ణిమ టాలీవుడ్ సినీ నటుడు టార్జాన్ (లక్ష్మీనారాయణ) వనజ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
ఆలయ ప్రధాన పూజారులు ప్రమోద్, సాయిశివ టార్జాన్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సదానందం గౌడ్, టార్జాన్ కు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. టార్జాన్ మాట్లాడుతూ మరకత శివాలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే వంద రెట్లు దర్శించుకున్నట్లు అని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వైస్ చైర్మన్ హనుమంతు, విక్రమ్, భానుశ్రీ ఉన్నారు.