సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని JNTU ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట, సమతా నగర్ మీదుగా ప్రగతి నగర్ రోడ్డు కు వెళ్లే కూడలి (వినాయక జ్యువెల్లర్స్) వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారనికై ట్రాఫిక్ సీఐ నరసింహ రావు తో కలిసి నిత్యం వాహనాల ట్రాఫిక్ నియంత్రణకై చేపట్టవలసిన చర్యలను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ JNTU ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట, సమతా నగర్ మీదుగా ప్రగతి నగర్ రోడ్డు కు వెళ్లే వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలిసి పరిశీలించడం జరిగినది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యల పై చర్చించడం జరిగింది అని అధికారులు సమన్వయంతో పనిచేయాలని రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా చూడాలని, చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళు వాహనాలు రోడ్ల పై పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచేయవద్దు అని అదేవిధంగా ట్రాఫిక్ సమస్య నివారణకై నాణ్యమైన ,మన్నిక గల రోడ్లను నిర్మిస్తామని , ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కార్పొరేటర్ చెప్పడం జరిగినది .ప్రజలకు ట్రాఫిక్ రహిత, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ నవీన్ కుమార్ మరియు ట్రాఫిక్ అధికారులు, డివిజన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.