ప్రజా సమస్యల పరిష్కారానికి..
వినుకొండ నియోజకవర్గం లోని ప్రజా సమస్యల పరిష్కారానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కాల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రామును ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా స్థానిక తిమ్మాయపాలెం రోడ్డు “Y” కన్వర్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పట్టభద్రులు సమావేశం మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ యువర్ ఎమ్మెల్యే బ్రోచర్ ను బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజా , ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు బిజెపి నాయకులు మేడం రమేష్ జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ మరియు జనసేన నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు నాయుకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.