రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని.
లలిత ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య.
సాక్షిత శంకర్ పల్లి : పేదలు,మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య సూచించారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత ఆసుపత్రిని ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,,,ఆస్పత్రి యాజమాన్యం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో సేవలందించాలని ఎమ్మెల్యే తెలియజేశారు.ఆసుపత్రికి వచ్చే రోగులను ముందుగా ప్రేమగా పలకరించి,అనంతరం వారి సమస్యలను తెలుసుకొని సేవలందించాలని తెలియజేశారు.వైద్యో నారాయణి హరి అంటారని, కనిపించే డాక్టర్లే దేవుళ్ళతో సమానమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…