తిరుపతి శ్రీనివాససేతు మూడవ దశ ట్రైల్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన
తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాససేతు మూడోదశ పనులు పూర్తిచేసుకుని ట్రైల్ రన్ కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రారంభించారు. తిరుచానూరు నుండి తిరుపతిలోకి ప్రవేసించే మార్కెట్ యార్డ్ సర్కిల్ దగ్గర నుంచి శ్రీనివాససేతు మొదలయ్యి లక్ష్మీపురం సర్కిల్ మీదుగా రామానుజ సర్కిల్ వద్ద నుండి రేణిగుంట రోడ్డు కళాంజలి వరకు పూర్తి చేసినటువంటి శ్రీనివాససేతు మూడవ దశను ట్రయల్ రన్ గస్ ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. అతి త్వరలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి పూర్తిస్థాయిలో శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ రహదారులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇప్పుడు ప్రారంభించిన ట్రయల్ రన్ ను పూర్తిస్థాయిలో టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.
మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరితలు మాట్లాడుతూ జూన్ చివరికల్లా పూర్తిస్థాయిలో పనులను పూర్తి చేయడం జరుగుతుందని, శ్రీనివాస సేతుపై ప్రయాణించడం వలన ఇటు నగర ప్రజలకు, అటు భక్తులకు ఉపయోగకరంగా వుంటుందన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎస్.కె.బాబులు ద్విచక్ర వాహనాలపై శ్రీనివాససేతుపై ప్రయాణించి ట్రయల్ రన్ ను ప్రారంబించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు తమ్ముడు గణేష్, కార్పొరేటర్ ఆంజినేయులు, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఆఫ్కాన్ స్వామి, ఏయికామ్ భాలాజీ తదితరులు పాల్గొన్నారు.