తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు…
సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంది.
నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువ గల 435 మొబైల్ ఫోన్లు రికవరీ.
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పొగొట్టుకున్న బాధితులకు 11 విడతల్లో 3840 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది.
12వ విడతలో 7,56,40,000 రూపాయల విలువ గల 4275 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది.
సత్పలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ.
ఆధ్యాత్మిక క్షేత్రంలో మొబైల్ ఫోన్లు పొగొట్టుకున్న వారి సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసి సేవలందించిన సైబర్ క్రైమ్ పోలీసులను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.
తిరుపతి జిల్లా పోలీసు అఫిషియల్ వెబ్ సైట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు .