SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 20 at 2.11.51 PM

అభివృద్ధిలో తిరుపతి ప్రత్యేక దృష్టి- నగర మేయర్ డాక్టర్ శిరీష
అభివృద్ధి లక్ష్యం, నగరంలో ఎటు చూసినా మౌలిక సదుపాయాలు- కమిషనర్ హరిత
సాక్షిత : చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్, 25వ డివిజన్లో సుమారు 32 లక్షల 60 వేల రూపాయల వ్యయంతో కొత్త సిమెంట్ రోడ్లు, కొత్త కాలువలు, త్రాగునీరు బోరును తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, ఉప మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని, అందులో భాగంగా 17వ డివిజన్ పాత తిరుచానూరు రోడ్డు నందు గ్రీన్ ప్లాజా అపార్ట్మెంట్ సమీపంలో 22 లక్షల 75 వేల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగిందని, అలాగే 25వ డివిజన్ కర్నాల వీధి, పల్లి వీధుల్లో 9 లక్షల 93 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, కాలవలు, బోర్ పాయింట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.
జగనన్న ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలలో తిరుపతి ప్రత్యేక అభివృద్ధి చెందిందని తెలిపారు.
మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ అభివృద్ధి పథంలో తిరుపతిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, నగర ప్రజల సహకారంతో ఇంత అభివృద్ధి చెందడం గర్వకారణమని తెలిపారు. తిరుపతిలో సౌకర్యాలు కల్పించే విషయంలో అన్ని విధాల ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలియజేశారు.

కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి నగరపాలక అభివృద్ధి పనులుపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అందులో బాగంగా నగరంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఉప మేయర్ భూమన అభినయ్ మాట్లాడుతూ 50 డివిజన్లో రోడ్లు, కాలవలు పనులు చేపట్టడం జరుగుతున్నదని, కుంచించుకుపోయిన రోడ్ల విస్తరణ పనులు, నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా నూతన రోడ్లు నిర్మాణం పనులు పూర్తి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్ర నారాయణ, 12వ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు యస్.కె.బాబు, కార్పొరేటర్లు తాళ్ళూరి రత్నకుమారి, కోటూరు ఆంజనేయులు, నరసింహ చారి, నగరపాలక యస్.ఈ. మోహన్, యం.ఈ చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ హరికృష్ణ, డి.ఈలు మహేష్, దేవిక, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS