SAKSHITHA NEWS

tirumala తిరుమలఅభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలు
భక్తులకు అన్నదానకార్యక్రమం
అంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన
సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రానికి అతి సమీపం లో ఉన్న తిరుమలయ్య గుట్ట సన్నిధిలో వెలసిన అభయాంజనేయ స్వామికి బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము కుటుంబ సమేతంగా అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా భజనలు నిర్వహించారు. అనంతరం పూజ కు హాజరైన ఆడపడుచులందరికీ పసుపు కుంకుమ తో పాటుజాకెట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

సుబ్బిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం
శ్రావణమాసంలో వచ్చే శనివారాలలో తిరుమలయ్య గుట్ట పై వెలసిన రంగనాయక స్వామి ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి నెలలో చివరి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. జిల్లాకు సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పట్టణానికి సంబంధించిన బిజెపి నాయకులు పలుమార్లు నియోజకవర్గ నాయకులకు వినతి పత్రాలు సమర్పించారు.

దాంతోపాటు వనపర్తి నుండి పెబ్బేరు కు వెళ్లే అటవీ ప్రాంతం మార్గంలో 58 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 5 గుంటల స్థలాన్ని కేటాయించి అక్కడ పర్యాటక కేంద్రంగా మార్చాలని వారు కోరారు. వనపర్తి నియోజకవర్గ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు భక్తులు అందరూ కలిసి తిరుమలయ్య గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా నాయకులు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు బి కృష్ణ చిత్తారి ప్రభాకర్ కుమారస్వామి రామన్న వెంకటేశ్వర రెడ్డి మాజీ కౌన్సిలర్ సుమిత్ర బిజెపి నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

tirumala

SAKSHITHA NEWS