SAKSHITHA NEWS

ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉంటాం – తీన్మార్ మల్లన్న…
తీన్మార్ మల్లన్నతో మంద కృష్ణ మాదిగ భేటీ…

ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించుకోవడం కోసం అన్ని వర్గాల, అన్ని శక్తుల మద్దతును సమీకరించడంలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు.

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానానికి అనుగుణంగా చేవెళ్ల ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ లో పేర్కొన్న హామీ ప్రకారం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలులో తీసుకురావడం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తీన్మార్ మల్లన్న మంద కృష్ణ మాదిగ కోరారు.

ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు లభించాలనే న్యాయమైన ప్రాతిపదికన జరుగుతుంది. కనుక ఎమ్మెల్సీగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని బీసీ సమాజం తరఫున మాదిగలకు మద్దతుగా నిలబడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంబిసి అధినేత సంగెం సూర్యారావు, ప్రముఖ కవి రచయిత, మాట్ల తిరుపతి, డిజిటల్ మీడియా ఇంచార్జి సోమారాపు మురళీ కృష్ణ, మరియు ఎంబీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS