మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలి – తుమ్మల వీరా రెడ్డి
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
మే 1 నుండి 7వ తేదీ వరకు జరుగనున్న మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. చిట్యాలలో గురువారం నాడు స్థానిక మేకల లింగయ్య స్మారక భవనం లో జరిగిన సిపిఎం మండల కమిటీ ల సంయుక్త సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 138 వ మేడే వార్షికోత్సవాల సందర్భంగా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను, పన్నెండు గంటలకు పొడిగించటంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైనదని అన్నారు. మేడే సందర్భంగా జరిపే సభల్లో దేశ వ్యాప్తంగా జరుగుతున్న మతోన్మాద చర్యలను, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్య పర్చనున్నట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లిం ల రిజర్వేషన్ విషయం లో రెచ్చగొట్టడం, ప్రజల మధ్య విబేధాలు సృష్టించే ప్రసంగాలు బాదాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యిందని విమర్శించారు. కేసీఆర్ ప్రకటించిన విధంగా పంట దెబ్బ తిన్న రైతు లకు ఎకరానికి పది వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నారబోయిన శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, రూరల్ మండల కార్యదర్శి అరూరి శీను, పార్టీ సీనియర్ నాయకులు పామనుగుల్ల అచ్చాలు, శీలా రాజయ్య, సిపిఎం మండల నాయకులు ఐతరాజు నర్సింహ,లడే రాములు, రుద్రారపు పెద్దులు, మెట్టు నర్సింహ, నకిరేకంటి రాములు, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, ఉయ్యాల సత్తయ్య, కందగట్ల గణేష్, ఐతరాజు యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.