ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి….
పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది అని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బహిరంగ సభలు లో కూడా మొత్తుకుంటున్నారు…
ఒక పక్క ఆంద్ర పోలీసులు పూర్తిగా గంజాయి స్మగ్లింగ్ కి చెక్ పెట్టే విధంగా వాహనాలు తనిఖీ లు ముమ్మరం చేశారు.. అందులో భాగం గా….
రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్న కంటెయినర్‌ను బాపట్ల జిల్లా సెబ్ అధికారులు గురువారం పట్టుకున్నారు.
బాపట్ల శివారున 216ఎ జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో పైలెట్ వాహనంతో వెళ్తున్న కంటెయినర్ లారీని బాపట్ల, చీరాల సెబ్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు.
వాహనం లోపల 17 బస్తాలలో ఉన్న మొత్తం 457 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు.
ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.