Thousands of Kalingas have moved
వేలాదిగా కదిలి వచ్చిన కాళింగలు
విశాఖ జిల్లా కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక వనభోజన కార్యక్రమం ఆదివారం మాధవధార తోటల్లో నిర్వాహకురాలు పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది
“పేడాడ” కృషిని అభినందించిన శాసన సభపతి తమ్మినేని సీతారాం
వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో కూడా అన్ని ప్రాంతాల్లో కాళింగలు ఉన్నారని, శ్రీకాకుళంలో అయితే జిల్లాలో సగభాగం తమ కులస్తులే ఉన్నారని చెప్పారు.ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుతనానికి గురికావడం వలన రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కాళింగలు కు న్యాయం జరిగిందని,కాళింగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి,దీనికి చైర్మన్గా పేరాడ తిలక్ ను ప్రభుత్వం నియమించింది అని అన్నారు.
రాజకీయంగా,సామాజికంగా,ఆర్థికంగా పైకి రావాలంటే ఒకరికొకరు ప్రోత్సాహం అందించుకోవాలన్నారు.కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం అందిస్తే వారు కూడా పైకి రావడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కులం అభివృద్ధికి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామనిఅన్నారు. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన అందరూ సంఘటితంగా కలిసి ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
మాజీ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ మాట్లాడుతూ కాళింగలు సంక్షేమానికి ప్రభుత్వం కృత నిశ్చయముతో ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ,కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ , శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ ,మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి ,మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ,మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి బాబ్జి ,50వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ,కళింగ కార్పొరేషన్ డైరెక్టర్లు,పోలీస్ అధికారులు,న్యాయమూర్తులు,ప్రముఖ వైద్యులు,వివిధ రాజకీయ పార్టీ నాయకులు,రెవిన్యూ అధికారులు,ప్రముఖ న్యాయవాదులు,వివిధ ప్రభుత్వ,కళింగ కుటుంబ సభ్యుల అధికారులు పాల్గొన్నారు.