ఈ నెల 14వ తేదీన వికారాబాద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికారాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్) ను సందర్శించారు.
ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం అవుతున్న సందర్భంగా… భారీ బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల , జిల్లా ఎస్పీ కోటిరెడ్డి , ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.