SAKSHITHA NEWS

This is a golden chapter in the history of Telangana: CM KCR

తెలంగాణ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం : సీఎం కేసీఆర్‌.

రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఏడు మెడికల్‌ కాలేజీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్‌ కాలేజీని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం.

ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్‌ సీట్లు, ఇంజినీరింగ్‌ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. మనం ఇవాళ ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం’ అన్నారు.

సొంత రాష్ట్రం ఏర్పాటుతోనే..
‘గతంలోనే మనం ప్రభుత్వరంగంలో నాలుగు కళాశాలను స్థాపించుకున్నాం. మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలో గతంలో నాలుగు ప్రారంభించాం. అవన్నీ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ విజయవంతంగా నిర్వహిస్తున్నది


SAKSHITHA NEWS