వరంగల్ జిల్లా కేంద్రంలో 4 కోట్ల 60 లక్షలతో నిర్మించిన దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉంది.
వరంగల్ అన్ని రంగాల్లో విశిష్టత స్థానాన్ని సాధించింది అనడానికి ఈ భవనం ఒక ఉదాహరణ.
ఈ భవనంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క-సారలమ్మ ఈవో, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయాలను ఇందులో ఏర్పాటు చేసుకున్నాం.
తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు చేస్తున్నారు.
దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మించింది.
గౌరవ సీఎం కేసీఆర్ గారు ధూప దీప నైవేద్యం పథకం కింద అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని 6 వేల నుంచి 10 వేలకు పెంచారు.
దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,541 మంది అర్చకులకు ప్రయోజనం చేకూరింది.
కొంతమంది రాజకీయ లబ్ది కోసం మాత్రమే హిందుత్వం అని మాట్లాడుతారే తప్ప అభివృద్ధిని పట్టించుకోరు.
నిజమైన నికాసైనా హిందూ నాయకుడు సీఎం కేసీఆర్ .
వరంగల్ తర్వాత రెండో రాజధానిగా ఉన్న వరంగల్ లో ధార్మిక భవన్ నిర్మించుకోవడం ఎంతో సంతోషకరం.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రణాళికా మండలి వైస్-ఛైర్మన్ బోయనపల్లి వినోద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ జిల్లా కలెక్టర్ సిక్తపట్నాయక్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.