SAKSHITHA NEWS

ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ!

TG: ఎన్నికల హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి
నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ రెండు విడతల
రుణమాఫీ చేసింది. మొదటి విడతలో రూ.1 లక్ష
రెండో విడతలో రూ.1.5 లక్షలలోపు రుణాలను
మాఫీ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా
మూడో విడత రుణమాఫీకి కాంగ్రెస్ సన్నద్ధమైనట్లు
తెలుస్తోంది. ఈ విడతలో రూ.1.5 లక్షల నుంచి రూ.2
లక్షల మధ్య రుణాలను మాఫీ చేయనున్నారు.