SAKSHITHA NEWS

They will tell us what the Telangana state government has done to the people….Do you have the guts to tell us what you have done?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో తాము చెబుతామని….మీరేం చేశారో చెప్పే దమ్ముందా అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రశ్నించారు. బుధవారం బేగంపేట లోని బేగంపేట ప్యాలెస్ లో బాలానగర్ మండల పరిధిలోని బేగంపేట డివిజన్ కు చెందిన 365 మంది లబ్దిదారులకు MLA మాధవరం కృష్ణారావు, MLC నవీన్ రావు లతో కలిసి ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. దేశం చరిత్రలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్ క్రింద ప్రతి నెల ఆర్ధిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తున్న ఘనత తెలంగాణా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. గతంలో ఉన్నవాళ్ళలో ఎవరైనా మరణిస్తేనే పెన్షన్ లు ఇచ్చేవారని, నేడు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లు అందిస్తున్నట్లు వివరించారు.

అంతేకాకుండా పేదింటి ఆడపడుచుల పెండ్లికి కల్యానలక్ష్మి, షాదీ ముబారక్ క్రింద ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, దేశంలో ఎక్కడా కూడా ఈ పథకం అమలు చేయడం లేదని అన్నారు. KCR కిట్ క్రింద ఆడబిడ్డ పుడితే 13 వేలు, మగబిడ్డ పుడితే 12 వేల రూపాయలను అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని, ప్రతి ఇంటికి ఉచితంగా నీటిని సరఫరా చేయడమే కాకుండా నల్లా బిల్లులలను కూడా మాఫీ చేసినట్లు చెప్పారు.

వర్షాకాలంలో బేగంపేట నాలా కు వచ్చే వరద నీటితో సమీప కాలనీలు, ఇండ్లు ముంపుకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, 50 సంవత్సరాలుగా ఈ సమస్యను ఎవరు కూడా పట్టిండుకోలేదని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చొరవతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టి 45 కోట్ల రూపాయల వ్యయంతో బేగంపేట నాల అభివృద్ది పనులను చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే కాకుండా నగరంలోని అనేక నాలాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. రోడ్ల అభివృద్ధి, పుట్ పాత్ ల నిర్మాణం ఫ్లై ఓవర్, అండర్ పాస్ ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని వివరించారు.

ముందు చూపు, ఏదైనా చేయాలనే పట్టుదల ఉంటే అది సాధ్యమని, అలాంటి నాయకుడు KTR మున్సిపల్ మంత్రిగా ఉండటం మనందరి అదృష్టం అని అన్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు జరుగుతుంటే ప్రతి పక్ష పార్టీలకు చెందిన నేతలు కండ్లు ఉండి చూడలేని కబోదులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని పండుగలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో గొప్పగా, సంతోషంగా జరుపుకొంటున్నారని అన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ ను దేశ విదేశాలలో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు.

గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే ప్రభుత్వం పై అర్ధంలేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి. జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, EE సుదర్శన్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS