SAKSHITHA NEWS

There is no dearth of talent in rural areas.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదు.

మహాత్మజ్యోతిబా పూలే బిసి బాలుర పాఠశాల ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.

హాజరైన గురుకులాల సెక్రెటరీ,ఎంపీ.

……

షాద్ నగర్ సాక్షిత ప్రతినిధి
చౌదరిగూడ:గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదని,అలాంటి వారిని గుర్తించి బయటకు తీసేది కేవలం ఉపాధ్యాయులదేనని అన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.మండల పరిధిలోని ఇంద్రానగర్ గ్రామంలో సర్పంచ్ మహబూబా ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపులే బాలుర పాఠశాలను ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి,గురుకులాల సెక్రెటరీ మల్లయ్య బట్టు హాజరయ్యారు.ముందుగా సర్పంచ్,ఎంపీ,బీసీ గురుకుల ప్రిన్సిపాల్,జెడ్పిటిసి,ఎంపిపి లతో కలసి పూజ కార్యక్రమాలు నిర్వహించి,నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు

.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ,మాట్లాడుతూ,,,దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఏర్పాటు చేసిన గురుకులాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్‌ ఉందని,అదిశగా సీఎం కేసీఆర్‌ విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు.బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు,కళాశాలలు ప్రారంభించి నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించాలన్నదే సీఎం లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, దేవేందర్ గౌడ్, రాములు,మండల అధ్యక్షుడు హఫీజ్, అక్రమ్, రాజేష్ పటేల్, రాంచంద్రయ్య గోపాల్ రెడ్డి, నరసింహ రావు, దామోదర్, మోతిలాల్ నాయక్,రెడ్డి,సర్పంచులు,ఎంపిటిసిలు,మార్కెట్ కమిటీ అధ్యక్షులు,ఛైర్మన్, సభ్యులు,మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల ఉపాద్యాయులు,విధ్యార్థులు,గ్రామస్థులు,యువకులు, మహిళా సంఘాల సభ్యులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు…


SAKSHITHA NEWS