చందానగర్ డివిజన్ పరిధిలోని కృష్ణ దేవాదాయ నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు GHMC మరియు జలమండలి అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సంతులిత, సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని ,వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లలో స్వయంగా ఇంటిటికి తిరుగుతూ ప్రజల నుండి తెలుసుకొని సత్వర పరిష్కారమే గా ధ్యేయంగా పనిచేస్తామని ,ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ను పరిగణలోకి తీసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
కృష్ణ దేవరాయ నగర్ కాలనీ అభివృద్ధి కి కృషి చేస్తానని కాలనీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని,కాలనీ వాసుల విజ్ఞప్తి మెరకు రోడ్లు, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. తర్వాత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే డ్రైనేజీ నిర్మాణం మ్యాన్ హోల్స్ మరమ్మత్తు లు చేపట్టాలని, అవసరమున్న చోట కొత్త మ్యాన్ హోల్స్ చేపట్టాలని మరియు త్వరలోనే రోడ్డు నిర్మాణము పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. రోడ్డు ను త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అదేవిధంగా కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు,అక్కడికి అక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగినది.అదేవిధంగా కాలనీల లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని మరియు . ముఖ్యంగా డ్రైనేజి, మంచి నీరు , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడం జరిగింది అని.సమస్యలపై ఎమ్మెల్యే గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని, ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీకాంతిని DE దుర్గాప్రసాద్ , AE సంతోష్ రెడ్డి, జలమండలి అధికారులు మేనేజర్ సుబ్రహ్మణ్యం మరియు చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగరాజు, నరేందర్ బల్లా , కాలనీ వాసులు రవికాంత్, విజయ, మమత మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.