There are many problems in Jaya Bharat Nagar Kalani under Hyder Nagar Division
సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జయ భారత్ నగర్ కాలని లో పలు సమస్యలు మరియు చేపట్ట వలసిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది మరియు కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీ రోడ్లు ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించామని
, ప్యాచ్ వర్క్ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని,
డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కుమారస్వామి, సురేష్, ప్రభాకర్ రావు, సాంబశివరావు, శివ రామకృష్ణ, రవీందర్ రెడ్డి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.