ఎమ్మెల్యే పంచకర్ల కలిన పెదముషిడివాడ యువ నాయకులు – జనసేన నాయకులు.
సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయితీలో గ్రామ జనసేన నాయకులు మరియు యువ నాయకులు,జనసైనుకులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 40 మంది యువత పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యలను పంచకర్ల రమేష్ బాబు వివరించడం జరిగింది. అయితే వాటికి ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఇప్పటి నుంచి నా కుటుంబం అని చెప్పి ఇక నుంచి మీ యూత్ పేరును “పంచకర్ల యువసేన” అని నామకరణం చేయడం జరిగింది.మా యూత్ అందరికీ ఇంతటి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పెదముషిడివాడ యువ నాయకులు మరియు జనసైనుకులు ధన్యవాదాలు తెలియజేసారు…