SAKSHITHA NEWS

హైదరాబాద్‌: రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ కేంద్ర రవాణా శాఖకు సోమవారం లేఖ రాసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు ‘టీజీ’తో ప్రారంభమవుతాయని, అందుకు వారం, పది రోజులు పడుతుందని రవాణాశాఖ వర్గాల సమాచారం. ‘

‘టీఎస్‌’ నుంచి ‘టీజీ’గా మారే ప్రక్రియ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కే పరిమితం అవుతుంది. ఇప్పటికే రిజిస్టర్‌ అయిన వాటికి ‘టీఎస్‌’ కొనసాగుతుంది’ అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రవాణాశాఖ వాహనాలను ‘టీఎస్‌’తో రిజిస్టర్‌ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ‘ఏపీ’ కోడ్‌తో రిజిస్టర్‌ అయిన వాహనాల నంబరు ప్లేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. ‘టీజీ’ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత వాహనాల నంబరు ప్లేట్లలో ఏపీ, టీఎస్‌ కోడ్‌లు యథాతథంగా ఉంటాయి’ అని ఆయన వివరించారు.

WhatsApp Image 2024 02 06 at 1.10.36 PM

SAKSHITHA NEWS