SAKSHITHA NEWS

ఎన్ టి ఆర్ జిల్లా తిరువూరు.

మంచ మెక్కిన తిరువూరు.

విష జ్వరాలతో విల విల్లాడుతున్న పట్టణ ప్రజానీకం.

పట్టించుకునే నాథుడేడి అని వాపోతున్న జనం

ఇంటింటా జ్వర పీడితులు.

డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో కిట కిట లాడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు.

ఇంటిల్లిపాదిని చుట్టబెడుతున్న విష జ్వరాలు.

దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు,ప్లేట్ లెట్స్ తగ్గి పోవటం లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు

ఇదే ఆదనుగా టెస్టింగ్, ట్రీట్మెంట్, తో పాటు ఇన్ పేషెంట్ రోగులను అధిక ఫీజు లతో పీల్చి పిప్పి చేస్తున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులు.

దీంతో ఇల్లు, ఒళ్ళు గుల్లయి ఆర్థికంగా కు దేలవుతున్న దిగువ, మధ్య తరగతి ప్రజానీకం.

పట్టణం లో అద్వాన్న పారిశుధ్యం, దోమలు స్పైర విహారం తో రోజు రోజుకు పెరుగు తున్న జ్వర పీడితులు.

డ్రైనేజి వ్యవస్థ అందుబాటులో లేని పరిస్థితుల్లో మురుగు నీటి పారుదల సక్రమంగా లేకపోవటం తో అపరి శుభ్ర వాతావరణం తో పిల్లలు, మహిళలు రోగాల బారిన పడుతున్న దైన్యం.

ప్రజా రోగ్యం పట్టని మున్సిపల్ పరిపాలన శాఖ అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు.

తక్షణం మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితి ని సమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేసి సమన్వయంతో ముందడుగు వేసి ప్రజారోగ్యం ను రక్షించాల్సిన అత్యవసర పరిస్థితి.

మరో పక్క పట్టణం లో డెంగ్యూ జ్వరాలు లేనే లేవంటున్న ప్రభుత్వ వైద్య అధికారులు, ఏఎన్ ఏం లు.

పట్టణం లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతున్న ప్రజా సంఘాలు.

ఇంటింటా జ్వర పీడితుల సర్వే చేసి ప్రాంతాల వారీగా మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేసి సకాలంలో మెరుగైన చికిత్సలు అందించి రోగుల ఆరోగ్యం ను మెరుగు పర్చే లా యుద్ధ ప్రాతిపదిక న చర్యలు చేపట్టాలని కోరుతున్న సామాజిక వేత్తలు, ప్రజా సంఘాలు.


SAKSHITHA NEWS