SAKSHITHA NEWS

ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు మెుదలుకానున్నాయి. శాసనసభ ప్రశోత్తారాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చ జరగనుంది. ఇవాళ మెుత్తం 19పద్దులపై చర్చించనున్నారు. శాసన సభ ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చించనున్నారు. మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమల శాఖ పద్దులపైనా చర్చ సాగనుంది. అలాగే ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణ, బీసీ సంక్షేమం, పాఠశాల విద్యా, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్ అండ్ హెల్త్‌పై సభ్యులు చర్చించనున్నారు.

మెుత్తం 19పద్దులపై చర్చించి అనంతరం వాటిని అమోదించనున్నారు. ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్, విద్యాశాఖ, హోంశాఖలు ఉండడంతో సభలో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను ధ్వంసం చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. విద్యుత్ పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు 2017లోనే ఉదయ్ స్కీంలో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సంతకాలు పెట్టలేదంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సభలో ఆసక్తికర చర్చ సాగే అవకాశం ఉంది.

WhatsApp Image 2024 07 29 at 09.57.44

SAKSHITHA NEWS