ఘట్కేసర్ లో చిన్నారి కథ సుఖాంతం
సాక్షిత హైదరాబాద్ :
ఘట్‌కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిందితుడు సురేష్‌తో పాటు పోలీసులు అతని వద్ద పాపను గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు నిందితుడిని గుర్తించారు. మరి కొద్ది సేపట్లో ఘట్‌కేసర్‌కు నిందితుడు, పాపను తీసుకురానున్నారు.
సాయంత్రం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈడబ్యూఎస్ కాలనీలో కృష్ణవేణి (4) అనే చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. పాప ఇంటి ముందు ఆడుకుంటుండగా సురేష్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు స్పెషల్ పార్టీ టీం గాలింపు చర్యలు చేపట్టింది. చిన్నారిని కిడ్నాప్ వ్యవహారాన్ని సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
సీసీ టీవీ ఫుటేజ్‌లో చిన్నారిని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకు వెళుతున్నట్టు అయితే కనిపించింది. ఇక కిడ్నాపర్ సురేష్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సురేష్.. ఒక్కో ఫోటోలో ఒక్కోలా కనిపిస్తున్నాడు. అయితే అతనికి ఇలా చిన్నారులను కిడ్నాప్ చేయడం కొత్తేం కాదని.. గతంలో కూడా సురేష్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. అప్పట్లో తాను పని చేస్తున్న థియేటర్‌లో వచ్చిన ఒక అమ్మాయిని సురేష్ కిడ్నాప్ చేశాడు….