హైదరాబాద్:
సరూర్‌నగర్ చెరువులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. సరూర్ నగర్ చెరువులో గేట్లు ఎత్తివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అంతకు ముందే గేట్ల వద్ద ఉన్న చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించే పనిలో పడ్డారు. గేట్లు ఎత్తివేసిన తరువాత పైపులలో వరద నీరు వెళ్ళేటప్పుడు చెత్త అడ్డంకిగా లేకుండా సిబ్బంది తొలగిస్తోంది.
ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ డీఈ పవన్ కుమార్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతం నుంచి సరూర్‌నగర్ చెరువులో నీరు ఎక్కువగా వచ్చి చేరుతోందన్నారు. గేట్లు ఎత్తివేతవేయడానికి ముందు చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. మొత్తం ఏడు గేట్లలో నాలుగు గేట్లను తెరువనున్నట్లు చెప్పారు. జిల్లాలగూడ, మీర్ పేట్, భైరామల్‌గూడ చెరువులతో పాటు పలు కాలనీలో నుంచి నీరు చెరువులోకి వచ్చి చేరుతున్నాయన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మూడు గేట్లను ఎత్తామన్నారు. ఇక్కడి నుంచి మూసిలోకి నీరు వెళ్తుందని చెప్పారు.
రాత్రి చెరువుపై భాగంలో ఉన్న కాలనీలలో నీరు భారీగా వచ్చిచేరిందని పవన్ కుమార్ తెలిపారు…