లింక్ రోడ్ల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, ప్రయాణ దూరం తగ్గించవచ్చు: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
……………………………………………………………
*సాక్షిత : *పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని లింకు రోడ్ల పనులపై ఎమ్మెల్యే కెపి.వివేకానంద హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ ఆర్ డి సి ఎల్), జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా…
1) ఎన్.హెచ్ 44 నుంచి ఫాక్స్ సాగర్ మీదుగా రాంరెడ్డి నగర్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు 29 కోట్లతో….
2) కైసర్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి గాజులరామారం మిథిలా నగర్ వరకు 36 కోట్లతో…
3) ప్రగతి నగర్ నుంచి ఎల్లమ్మ బండమీదుగా మహాదేవపురం వెటర్నరీ హాస్పిటల్ వరకు 30 కోట్ల రూపాయలతో లింకు రోడ్డు పనులను చేపట్టనుండగా అదేవిధంగా భూదేవి హిల్స్ లింకు రోడ్డు పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ లింకు రోడ్ల అభివృద్ధితో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతోపాటు దూరం తగ్గుతుందన్నారు. లింక్ రోడ్డు పనుల అభివృద్ధిపై అధికారులు ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, డిప్యూటీ కమిషనర్లు నరసింహ, మల్లారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసిపి సురేందర్ రెడ్డి, టిపిఎస్ రమేష్, న్యాక్ ఇంజనీర్ జయశ్రీ , విజయ్ కుమార్, విట్టలయ్య, హెచ్ఆర్డి సిఎల్ అధికారులు జెరేమయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.