SAKSHITHA NEWS

The services of the Home Guards who play role models are indescribable

రోల్ మోడల్ పాత్ర పోషిస్తున్న హోంగార్డుల సేవలు అనిర్వచనీయం:
పోలీస్ కమిషనర్


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

సమాజంలో రోల్ మోడల్ పాత్ర పోషిస్తున్న హోంగార్డు ఆఫీసర్ల సేవలు అనిర్వచనీయమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.


60వ హోంగార్డు ఆవిర్భవ దినోత్సవం పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ముఖ్యతిదిగా పాల్గొన్నారు. ముందుగా హోంగార్డు ఆఫీసర్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ కమాండర్ గా వేంకటేశ్వర్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …


పోలీస్ శాఖ విధులకు సహకారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డు ఆర్గనైజేషన్ ప్రస్తుత సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని ఇదే స్పూర్తితో వృత్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తూ.. భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.


నేర నియంత్రణలో శాంతిభద్రలు ట్రాఫిక్‌ నియంత్రణ బ్లూకోల్డ్స్ పెట్రోల్‌కార్‌ డ్రైవర్లు కార్యాలయాల భద్రత రాత్రి గస్తీ బందోబస్తు విధులు నిర్వహిస్తూ కీలకమైన బాధ్యతలు చేపడుతున్నారని కొనియాడారు. కోవిడ్ సమయంలో సైతం ఫ్రంట్ లైన్ వారియర్ గా కీలకపాత్ర పోషించారని అన్నారు.

ఇటీవల కాలంలో ఇద్దరు హోంగార్డులు గుండెపోటుతో మరణించడం దురదృష్టకరమని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విధిగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిక్షలు నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.


ఆనంతరం వాలీబాల్ టాగ్ ఆఫ్ వార్ మ్యుజికల్ చైర్ క్రీడలలో గెలుపొందిన హోంగార్డు ఆఫీసర్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,
ఏ ఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఖమ్మం రూరల్ ఏసీపీ భస్వారెడ్డి, ఏస్ బి ఎ సి పి ప్రసన్న కుమార్, సి సి ఎస్ ఏసీపీ రవి, సిఐలు చిట్టిబాబు , సర్వయ్య, రామకృష్ణ , ఆశోక్ కుమార్, ఆర్ ఐ లు శ్రీశైలం ,రవి, తిరుపతి పాల్గొన్నారు.


SAKSHITHA NEWS