SAKSHITHA NEWS

ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనే
మెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత

నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలో
ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానీకానికి ఓరగబెట్టింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం కేంద్రం బాలాజీ గార్డెన్ లో నిర్వహించిన సభలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రసంగించారు. దేశ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం రావడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇందిరమ్మ హాయంలోనే ఈ మెదక్ ప్రాంతం అభివృద్ధి జరిగిందని తెలిపారు. పేదలకు భూములు, ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలలో ఐదు పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగిన ఆయన ఇప్పుడు ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవ చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఎల్లవేళలా జనంలోనే ఉంటూ మానవత్వంతో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నానని తెలిపారు.

ఎంపీ
ఎన్నికలలో తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని మెదక్ ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించుకునే సత్తా తనకుందని అన్నారు. గతంలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనకు ఎంపీ సీటు ఇస్తానని నమ్మించి మోసం చేశాడని, అయినా కృంగిపోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలనను కొనసాగిస్తుందని, దాంతోనే కాంగ్రెస్ లోకి వచ్చానని పేర్కొన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన నీలం మధు గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికలలో డబ్బు గెలిచిందని, ఈ పార్లమెంట్ ఎన్నికలలో అదే డబ్బును ఓడిస్తామని అన్నారు. బీఆర్ఎస్, బిజెపిలు కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆయా పార్టీల మాటలు నమ్మవద్దని సూచించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన నీలం మధును ఈ పార్లమెంటు ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ మహిళ ఇన్చార్జి సుజాత సత్యం, సుహాసిని, కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, ఎంపీపీ నరేందర్ రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు, మాజీ మండలాధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ లీడర్ నరసింహారెడ్డి, యూత్ లీడర్ మల్లేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 25 at 5.23.21 PM

SAKSHITHA NEWS