SAKSHITHA NEWS

The services of donors are unforgettable.

*కొందుర్గ్ మండల విద్యాశాఖాధికారి కిష్టారెడ్డి*

కొందుర్గ్, దాతల సేవలు మరువలేనివని కొందుర్గ్ మండల విద్యాశాఖాధికారి కిష్టారెడ్డి అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయనికి కొందుర్గ్ గ్రామానికి చెందిన పెద్ది శ్రీనివాస్ గుప్తా 25 వేల విలువైన మైక్ సెట్ ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంఈవో కిష్టారెడ్డి మాట్లాడుతూ పెద్ది శ్రీనివాస్ గుప్తా కొందుర్గ్ లోని ఉన్నత పాఠశాలకు దాదాపు 2 లక్షల విలువైన పనులు చేయించారని, అలాగే జీయూపీఎస్ పాఠశాలకు దాదాపు 50 వేల విలువైన పనులు చేయించారని వివరించారు. అలాగే ఎస్ ఎం సీ సభ్యురాలు కవిత రెండు కూర్చీలను అందజేశారు.

అనంతరం దాత పెద్ది శ్రీనివాస్ గుప్త తమ్ముడు పెద్ది రామకృష్ణ ను శాలువతో సన్మానించారు.అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా మొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేకాధికారిణి శేకీనా నిస్సీ, ఎస్ ఎం సీ చైర్మన్ కె శ్రీనివాస్, వైస్ చైర్మన్ డి శోభారాణి .కవిత, ఉపాధ్యాయులు రజిత, అనురాధ, మంజుల, మల్లీశ్వరి, కల్పన, సుజాత తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS