మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణా మలిదశ ఉద్యమానికి ఉపిరిలూదిన పోరాట యోధుడు ,అమరవీరుడు సిరిపురం యాదయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 ఏళ్ల పసి వయసులో తెలంగాణ సాకారం కోసం అమరుడైన సిరిపురం యాదయ్య తెలంగాణ ప్రజల గుండేల్లో స్థిరస్థాయిలో నిలిచిపోతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గట్టగల్లా రవి, భాస్కర్ రెడ్డి, రామారావు ముదిరాజ్, గడ్డం మహేష్, అజయ్ యాదవ్, అనిల్ గౌడ్, నిరుడు జంగయ్య, మల్లేష్ యాదవ్, రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు