రెండవ రోజు ముస్లిం కాలనీ పెదకూరపాడు లో మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం
ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
సాక్షిత : పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు నిర్వహిస్తున్న మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గంలో చసిన అభివృద్ధికి, అందించిన సంక్షేమానికి ప్రజలు ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. పెదకూరపాడు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కి స్థానికులు ఘనస్వాగతం పలికారు. పలు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే .. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. తమకు అందిన సంక్షేమ పథకాలు చెబుతూ ఎంతోమంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ఐదేళ్ల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని.. దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. సంక్షమ పథకాలను క్రమం తప్పకుండా అందిస్తూ.. పేదల గుండెల్లో గూడు కట్టుకున్న జగన్ పై చూపిస్తున్న ప్రేమతో పెదకూరపాడులో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించానని.. ప్రజలు తాను చేసిన మంచిని గుర్తు పెట్టుకొని ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP