SAKSHITHA NEWS

స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణలో నిఘా బృందాల పాత్ర కీలకం

-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణలో నిఘా బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఎంసిసి బృందాలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో నిఘా బృందాలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జిల్లాలో 15 ఎస్ఎస్టీ, 12 ఎఫ్ఎస్టీ, 27 ఎంసిసి బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మొదటి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఆవరణల్లో, 48 గంటల్లో పబ్లిక్ స్థలాల్లో, 72 గంటల్లో ప్రయివేటు స్థలాల్లో రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీలకు సంబంధించి హోర్డింగ్, ఫ్లెక్సీ, ఫోటోలు తొలగించాలన్నారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాలన్నారు. చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఉండాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని అన్నారు. జప్తుల సంఖ్య కాకుండా, సమర్థవంతంగా ఉండాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సమాచార సేకరణ, ప్రజల్లో స్-విజిల్ యాప్ పై అవగాహన కలిగే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎస్ఎస్టి ల పనితీరు క్రియాశీలకంగా ఉండాలని, రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేయాలని అన్నారు. అన్ని రాజకీయ పక్షాలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్దతిలో అనుమతులు ఇవ్వాలన్నారు.
కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి కె. శ్రీరామ్ బృందాలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, జెడ్పి సిఇఓ వినోద్, సిపిఓ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ గోపాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 18 at 7.33.43 PM

SAKSHITHA NEWS