SAKSHITHA NEWS

పేదల బియ్యం.. మాఫియాకు వరంగా మారాయి

రేషన్ బియ్యం అక్రమ రవాణాను ప్ర‌జ‌లు అడ్డుకోవాలి

కూట‌మి ప్ర‌భుత్వానికి త‌ల‌వంపులు తెచ్చే ఏ ప‌నిని స‌హించం

జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌:
కూట‌మి ప్ర‌భుత్వానికి త‌ల‌వంపులు తెచ్చే ఏ ప‌నిని జ‌న‌సేన స‌హించ‌ద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి హెచ్చ‌రించారు.శుక్ర‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ పేద‌ల‌కు అందాల్సిన రేష‌న్ బియ్యం ప‌క్క‌దారి ప‌డుతున్నాయ‌ని, సిండికేట్లుగా మారి కొంత‌మంది పేద‌ల బియ్యాన్ని అక్ర‌మ మార్గాల్లో త‌ర‌లిస్తున్నార‌ని మండి ప‌డ్డారు.ఈనెల 7న పల్నాడు జిల్లాలో ఏడు రైస్‌ మిల్లులను స్వ‌యాన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనిఖీ చేయగా 1000 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయని, సత్తెనపల్లిలోని రైస్‌మిల్లులో అదేరోజు మేడికొండూరు మండలంలో ఓ రైస్‌మిల్లులో పెద్దమొత్తంలో పీడీఎస్‌ బియ్యం గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు.ఉమ్మ‌డి గుంటూరు జిల్లాల్లో కొన‌సాగుతున్న రేష‌న్ మాఫీయాకు అధికారులు తెర‌దించాల‌ని,క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాలాజి కోరారు.

బియ్యం అక్ర‌మ ర‌వాణాను ప్ర‌జ‌లు అడ్డుకోవాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణమ‌ని బాలాజి మండిప‌డ్డారు. కూటమి ప్రభుత్వం 43 రూపాయల 40 పైసల‌కు కొనుగోలు చేసి పేద ప్రజలకు అందిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో పేద‌లకు అందించే బియ్యం,రేష‌న్ స‌రుకుల విష‌యంలో వైసీపీ నేత‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, పేద‌ల‌కు అందించాల్సిన బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి జేబులు నింపుకున్నార‌ని ఆరోపించారు.మొత్తం మీద‌ వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా భ‌ష్టు ప‌ట్టించింద‌న్నారు వైసీపీ పాల‌న‌లో కొన‌సాగిన అక్ర‌మాల‌ను ఆన‌క‌ట్ట వేసే విధంగా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర్ణ‌లు తీసుకువ‌చ్చింద‌ని వెల్ల‌డించారు.రాష్ట్రంలో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ శాఖను ఆదర్శశాఖగా తీర్చిదిద్దుతున్నార‌ని బాలాజి వెల్ల‌డించారు.పేద‌ల‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేయకుండా ప్రజలు అడ్డుకోవాల‌ని కోరారు.


SAKSHITHA NEWS