ఓటమి నుండి స్పూర్తి పొందడమే అసలైన గెలుపు – మంత్రి జగదీశ్ రెడ్డి
— యువత నిరంతరం ఆశావాహులై ఉండాలి
— చదువు అంటే ఉద్యోగం అనే భావన ను విడనాడాలి
— ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత క్రీడా స్పూర్తి ని అలవర్చుకోవాలి
సూర్యాపేట జిల్లా (సాక్షిత ప్రతినిధి)
ఓటమి నుండి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరుగనున్న కానిస్టేబుల్ రాత పరీక్ష కు హాజరు కానున్న అభ్యర్థులకు ప్రేరణ (మోటివేషన్) కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అభ్యర్ధుల కు తన అనుభవాలతో ప్రేరణ కల్పించారు. మంత్రి మాట్లాడుతూ యువత నిరంతరం ఆశావాహులై ఉండాలి అని పేర్కొన్నారు. ఆలోచనలలో పేదరికాన్ని దరి చేరనేయవద్దన్నారు.. ఆలోచనలు గొప్పగా ఉంటేనే జీవితం లో ఎత్తుకు ఎదగవచ్చని అన్నారు.పనిచేసే అవలక్షణమే యువత కు గొప్ప కావాలి అని అన్నారు. ఏ పని చేయకుండా ఉంటే తన జీవితం లోకి దారిద్ర్యం ను ఆహ్వానించి నట్లే అని మంత్రి అన్నారు. దురదృష్టవశాత్తు
చదువు అంటే ఉద్యోగం మాత్రమే అనే భావన సమాజాన్ని పట్టి పీడిస్తుందని , ఆ భావన ను యువత విడనాడాలి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధించాలనే తపన తో పాటు,యువత క్రీడా స్పూర్తి ని అలవర్చుకోని జీవితం లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఆదివారం జరుగ బోయే కానిస్టేబుల్ పరీక్షలో సూర్యాపేట నుండి హాజరయ్యే 193 మంది యువతీ , యువకులు మెరిట్ సాధించి ఉద్యోగం సాధించే వారికి ముందస్తు అభినందనలు తెలిపారు. కానిస్టేబుల్ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం లో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాములు, పోలీసు అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.