SAKSHITHA NEWS

The process of grain purchase should be completed

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

సుజాతనగర్ లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో గల ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించి, తదుపరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి ధాన్యం యొక్క నిర్ణీత తేమశాతం (17% ) వచ్చేవరకు ఆరబెట్టుకోవాలని రైతులకు సూచనలను ఇచ్చారు. కొనుగోలు కేంద్రంలో గల ధాన్యాన్ని అకాల వర్షాలకి తడవకుండా టార్పానులతో కప్పి ఉంచాలని మరియు కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో సంబందిత మిల్లులకు తరలించాలని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం అధికంగా ఉన్నందువలన ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లుకు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డి ఆర్ డి ఓ విద్యాచందన, జిల్లా మేనేజర్ పౌరసరఫరాల కార్పొరేషన్ త్రినాధ్ బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణి, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు మరియు జిల్లా సహకార అధికారి ఖుర్షీద్ తదితర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS